కై లాస్‌నగర్: నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం, పునరావాస పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భూసేకరణకు రూ.6వేల కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల చేసినట్లుగా పేర్కొన్నారు. విడుదలైన నిధులతో అవార్డులు జారీ చేసిన భూములకు పరిహారం చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమించి, ప్రతీ వారం పురోగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. రైతులతో నేరుగా చర్చించి, నిబంధనల ప్రకారం, మార్కెట్ విలువకు సాధ్యమైనంత సమీపంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ వీసీలో ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ఏఈ ప్రశాంత్, ఏవో వర్ణ తదితరులు పాల్గొన్నారు.


