ఎయిర్‌పోర్ట్‌ పనులు మరింత వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌ పనులు మరింత వేగవంతం

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కైలాస్‌నగర్‌: జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రి య పనులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం సమీక్షించారు. భూసేకరణ, క్షేత్రస్థాయి సర్వేవంటి అంశాలపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ జగదీష్‌, ఆర్డీవో జగదీశ్వర్‌ రావు, ఎస్‌ఈ. ప్రభు కళ్యాణ్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సుభాష్‌, భూసర్వే, కొలతల శాఖ ఏడీ ప్రభాకర్‌, ఏవో వర్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, అర్‌అండ్‌బీ ఈఈ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు సీఎం సమీక్ష

ప్రతిపాదిత ఆదిలాబాద్‌ జాయింట్‌ యూజర్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియ ముమ్మరమవుతుంది. భూసేకరణ సర్వేప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా, గ్రా మసభలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నిర్వాసితులకు అందించే నష్టపరి హారం ధరలు నిర్ణయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11గంటలకు సచివాలయంలో నిర్వహించే ఈ సమీ క్షకు కలెక్టర్‌ రాజర్షి షా, అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, ఆర్డీవో జగదీశ్వర్‌రావు తదితరులు వెళ్లనున్నారు. సమావేశం అనంతరం భూసేకరణ ప్రక్రియ మరింత వేగవంతమయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement