కూకట్‌పల్లి ప్రజలు ఏం పాపం చేశారు..? | Kukatpally MLA Madhavaram Krishna Rao takes on CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారు

Jun 13 2026 2:18 PM | Updated on Jun 13 2026 2:18 PM

Kukatpally MLA Madhavaram Krishna Rao takes on CM Revanth Reddy

ఎమ్మెల్యే, అధికారులకు సమస్యలు వివరిస్తున్న ప్రజలు

సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదు 

రెండున్నరేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపాటు

సాక్షి, హైద‌రాబాద్‌: కూకట్‌పల్లి ప్రజలు ఏం పాపం చేశారో తెలియదు కానీ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌ వార్డు కార్యాలయంలో వివిధ విబాగాల అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించి అక్కడికి అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.

నియోజకవర్గంలో ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 20 ఏళ్ల కిందటి సమస్యలను రెండున్నర ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ చూస్తున్నారన్నారు. మంచినీటి సమస్య పరిష్కారానికి తమ హయాంలో 9 రిజర్వాయర్లను నిర్మించామన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని లేని పక్షంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.

నియోజకవర్గంలోని డివిజన్లను మూడు ముక్కలు చేసి మాల్కాజ్‌గిరి  ఎంఎంసీలో కలపడంతో బోయిన్‌పల్లి సర్కిల్‌ కార్యాయం ఎక్కడుందో తెలియక  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సర్కిల్‌ అదికారులెవరో ఎమ్మెల్యేగా తనకే తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను  మెరుగు పర్చాల్సి ఉందన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం మల్కాజ్‌గిరి జోనల్‌ కమిషనర్‌ నుంచి ఎమ్మెలేకు రావాల్సిన నిధులు కూడా రావడం లేదన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.  

చ‌ద‌వండి: హెచ్‌ఎండీఏ భూ వేలంపై నీలినీడలు

సమావేశంలో మాజీ కౌన్సిలర్‌ ముద్దం నర్సింహయాదవ్‌. గజ్జెల నాగేశ్‌, సతీష్‌గౌడ్, డిప్యూటి కమిషనర్‌ డాక్‌నాయక్, ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ సౌందర్య, వరుణ్‌దేవ్, శానిటేషన్‌ డీఈ సందీప్, వాటర్‌ వర్క్స్‌ జీఎం సునీల్, డీజీఎం కృష్ణమాచారి, మేనేజర్‌ నవీన్, టీపీఎస్‌ కుర్మయ్య, ఆర్‌ఐ నాగమణి సర్వేయర్‌ అనిత నాయకులు హరినాథ్, నరేందర్‌గౌడ్, బల్వంత్‌రెడ్డి, కర్రె జంగయ్య, మక్కాల నర్సింగ్‌రావు మాక్కల సత్యనారాయణ, సయ్యద్‌ ఏజాజ్‌ లలితా, ఉదయ్‌రాణి, సరోజదేవి కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement