విశ్రాంత ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసు.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ | IPS Officer Vinayranjan's Wife Murder Case Scene Reconstruction, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసు.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

Jun 11 2026 9:53 AM | Updated on Jun 11 2026 11:36 AM

IPS Officer Vinayranjan's Wife Murder Case Scene Reconstruction

బంజారాహిల్స్‌: నగల కోసం ఇంటి యజమానురాలిని దారుణంగా హత్య చేసి పరారైన నేపాలీ గ్యాంగ్‌లో ఓ కీలక నిందితుడితో పాటు రిసీవర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు పది రోజల కస్టడీకి తీసుకోగా బుధవారం వీరితో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

గత నెల 8వ తేదీన జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో నివసించే విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వినయ్‌రంజన్‌ ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన కల్పన అలియాస్‌ ధర్మ.. నేపాల్‌కే చెందిన మరో ఏడు మందిని పిలిపించి నగలు దొంగిలించి ఆయన భార్య తనూజను దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

నిందితుల్లో ఒకరైన సునీల్‌ పరియార్‌ను ముంబాయిలో అరెస్టు చేశారు. ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్‌ దిలీప్‌ను కూడా అరెస్టు చేశారు. కస్టడీలో భాగంగా వీరిద్దరినీ ప్రశాసన్‌నగర్‌లోని తనూజ హత్య చేసిన ఇంటికి తీసుకువచ్చి ఆ రోజు ఏమి జరిగిందో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు.అవసరమైతే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం పూణె, ముంబాయికి కూడా వెళ్లేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement