సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పేరుతో.. 54 లక్షల హోం లోన్‌ | Incident Of Fraudulently Obtaining A Loan Worth Lakhs On Hyderabad Nizampet | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పేరుతో.. 54 లక్షల హోం లోన్‌

Jun 23 2026 11:52 AM | Updated on Jun 23 2026 11:58 AM

Incident Of Fraudulently Obtaining A Loan Worth Lakhs On Hyderabad Nizampet

నిందితుడు బానొత్‌ ప్రసాద్‌ రావు

నిజాంపేట్‌ :  అమాయక దంపతుల ఫ్లాట్‌ను అక్రమంగా రిజి్రస్టేషన్‌ చేసి, రూ.54 లక్షల బ్యాంకు రుణం పొందిన ప్రధాన నిందితుడు బానొత్‌ ప్రసాద్‌రావు (37)ను బాచుపల్లి పోలీసులు  అరెస్ట్‌ చేశారు.  పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసాద్‌రావు లోన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

నిజాంపేట్‌ కు చెందిన మనోహర్‌ దంపతులకు రూ.25 లక్షలు ఇచ్చి వారి ఫ్లాట్‌ పత్రాలను తాకట్టు పెట్టుకున్నాడు. అనంతరం ఆస్తిని తన సంస్థ పేరిట మార్చి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పేరుతో బదిలీ చేసి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.54 లక్షల హోం లోన్‌ పొందాడు. జనవరి 2026లో బ్యాంకు రికవరీ సిబ్బంది బాధితుల వద్దకు రావడంతో మోసం బయటపడింది.

బాధితుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, జూన్‌ 19న ఖమ్మంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి మొబైల్‌ స్వా«దీనం చేసుకున్నారు. ఇదే తరహా మరో కేసు దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా నమోదైందని అధికారులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement