breaking news
money freeze
-
చెక్కుపై రూ.55 కోట్లు.. దిమ్మతిరిగే ప్లాన్! కానీ..
హైదరాబాద్, పంజగుట్ట: ఓ ఔషధ సంస్థకు చెందిన చెక్కుపై రూ.55 కోట్లు రాసుకుని బ్యాంకును, ఔషధ సంస్థను మోసం చేసేందుకు యత్నించిన వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ అనే ఔషధ సంస్థకు బెంగళూరు కెనరాబ్యాంకులో అకౌంట్ ఉంది.2024లో వీరి చెక్ బుక్ నిండిపోవడంతో కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేస్తూ పాత చెక్‌బుక్ లోని ఆఖరు చెక్కును సంతకం చేసి ఎలాంటి నగదు వివరాలు రాయకుండా దరఖాస్తుతో పాటు పొందుపర్చి బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఆ చెక్కును యూపీకి చెందిన జగత్సింగ్ అనే వ్యక్తి సేకరించి అందులో రూ.55 కోట్లు రాసుకుని సోమాజిగూడలోని కెనరాబ్యాంకులో ఉన్న తన ఖాతాకు బదిలీ చెసుకునేందుకు ప్రయత్నించాడు.బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి సదరు ఔషధ సంస్థను సంప్రదించడంతో వారు ఈ చెక్కును తాము కొత్త చెక్కుబుక్ కోసం దరఖాస్తు చేస్తూ బ్యాంకులో ఇచ్చామని చెప్పడంతో నగదు బదిలీ ఆపారు. ఔషధ సంస్థ నిర్వాహకులు నగరానికి చేరుకుని గురువారం అసలు బ్యాంకులో సమర్పించిన తమ చెక్కు బయటకు ఎలా వచ్చిందో తెలుసుకోవడంతో పాటు.. దాన్ని డ్రా చేసుకునేందుకు యత్నించిన జగత్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి పేరుతో.. 54 లక్షల హోం లోన్
నిజాంపేట్ : అమాయక దంపతుల ఫ్లాట్‌ను అక్రమంగా రిజి్రస్టేషన్ చేసి, రూ.54 లక్షల బ్యాంకు రుణం పొందిన ప్రధాన నిందితుడు బానొత్ ప్రసాద్‌రావు (37)ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసాద్‌రావు లోన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.నిజాంపేట్ కు చెందిన మనోహర్ దంపతులకు రూ.25 లక్షలు ఇచ్చి వారి ఫ్లాట్ పత్రాలను తాకట్టు పెట్టుకున్నాడు. అనంతరం ఆస్తిని తన సంస్థ పేరిట మార్చి, సాఫ్ట్వేర్ ఉద్యోగి పేరుతో బదిలీ చేసి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.54 లక్షల హోం లోన్ పొందాడు. జనవరి 2026లో బ్యాంకు రికవరీ సిబ్బంది బాధితుల వద్దకు రావడంతో మోసం బయటపడింది.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, జూన్ 19న ఖమ్మంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి మొబైల్ స్వా«దీనం చేసుకున్నారు. ఇదే తరహా మరో కేసు దుండిగల్ పోలీస్ స్టేషన్లో కూడా నమోదైందని అధికారులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. -
ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ
రియోడిజనిరో: ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెజిల్ పోలీసులు ఆ సంస్థకు చెందిన దాదాపు 60లక్షల డాలర్లను ఫ్రీజ్ చేశారు. ఓ కేసుకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు ఈ సంస్థ అనుబంధ సంస్థ అయిన వాట్సాప్‌కు నిరాకరించడంతో ఈ మేరకు నిధులను ఫ్రీజ్ చేశారు. ఓ అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా కేసుకు సంబంధించిన నేరస్తులు వాట్సాప్ ద్వారానే సంప్రదింపులు జరిపారని, ఆ వివరాలు తమకు తెలపాలని గత కొద్ది రోజులుగా వాట్సాప్ ను బ్రెజిల్ పోలీసులు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. నోటీసులు పంపించినా అందుకు వాట్సాప్ అంగీకరించలేదు. మే నెలలో మూడుసార్లు వాట్సాప్‌ను పూర్తిగా నిలిపివేశారు కూడా. పలుమార్లు తీవ్రంగా ప్రయత్నించిన పోలీసులు చివరకు విచారణలో భాగంగా ఫేస్ బుక్ కు చెందిన పెద్ద మొత్తం ఫండ్స్ ఫ్రీజ్ చేశారు.


