ఫేస్బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ | Brazilian court freezes $6 mn Facebook funds | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ

Jul 2 2016 2:23 PM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 60లక్షల డాలర్లను ఫ్రీజ్ చేసింది.

రియోడిజనిరో: ఫేస్బుక్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెజిల్ పోలీసులు ఆ సంస్థకు చెందిన దాదాపు 60లక్షల డాలర్లను ఫ్రీజ్ చేశారు. ఓ కేసుకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు ఈ సంస్థ అనుబంధ సంస్థ అయిన వాట్సాప్కు నిరాకరించడంతో ఈ మేరకు నిధులను ఫ్రీజ్ చేశారు.

ఓ అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా కేసుకు సంబంధించిన నేరస్తులు వాట్సాప్ ద్వారానే సంప్రదింపులు జరిపారని, ఆ వివరాలు తమకు తెలపాలని గత కొద్ది రోజులుగా వాట్సాప్ ను బ్రెజిల్ పోలీసులు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. నోటీసులు పంపించినా అందుకు వాట్సాప్ అంగీకరించలేదు. మే నెలలో మూడుసార్లు వాట్సాప్ను పూర్తిగా నిలిపివేశారు కూడా. పలుమార్లు తీవ్రంగా ప్రయత్నించిన పోలీసులు చివరకు విచారణలో భాగంగా ఫేస్ బుక్ కు చెందిన పెద్ద మొత్తం ఫండ్స్ ఫ్రీజ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement