హైదరాబాద్‌: ఓయో లాడ్జిలో బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి | Hyderabad: Young Woman Lost Her Life At Oyo Hotel | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ఓయో లాడ్జిలో బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

Jun 25 2025 3:35 PM | Updated on Jun 25 2025 4:05 PM

Hyderabad: Young Woman Lost Her Life At Oyo Hotel

సాక్షి, హైదరాబాద్‌: ఓయో లాడ్జిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపిన ప్రకారం.. నల్లగండ్లలో నివాసం ఉండె జి.అనూష(26) ఆన్‌లైన్‌ ఆర్డర్లపై బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. గత సంవత్సరం వివాహం జరగ్గా మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి అనూష తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.

ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. రాత్రి ఫోన్‌ చేసినా స్పందించలేదు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ లాడ్జిలో అనూష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు సమాచారం అందించారు.

సీలింగ్‌ ప్యాన్‌కు కర్టన్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని, కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సంతోష్‌ అనే వ్యక్తి మొదట సమాచారం అందించాడని, తన సోదరి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని సోదరుడు రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement