HYD: సరూర్‌నగర్‌లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం! | Hyderabad Saroornagar Blasting Incident | Sakshi
Sakshi News home page

HYD: సరూర్‌నగర్‌లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం!

Jun 30 2026 1:25 PM | Updated on Jun 30 2026 2:29 PM

Hyderabad Saroornagar Blasting Incident

హైదరాబాద్: సరూర్‌నగర్‌లోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఆ ధాటికి ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. స్థానికుల వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌ పరిధిలోని బాబూనగర్‌లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీగా పేలిన శబ్ధం వినిపించింది. ఆ శబ్ధానికి అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో ఆరా తీస్తున్నారు.

అయితే, ఆ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్టుగా పోలీసులు చెప్పారు. అలాగే, అదే సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు సంభవించిన సమయంలో ఇంట్లో మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉన్నా వాటినుంచి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో పేలుడుకు అసలు కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement