తెలంగాణ: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
స్థానికుల అందించిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు తన భార్య సావిత్రి, కుమారుడు, కుమార్తెలుగా తెలుస్తోంది. వీరు కుటుంబంతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. గొల్లపల్లి పరిధిలోని మజీద్ మలుపు వద్ద గుర్తుతెలియని ఓ వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు దంపతులతో పాటు, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. అయితే వారితో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న కుమార్తె ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది.
అలాగే, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కాగా, బైక్‌ను ఢీకొట్టిన వాహనం, అలాగే ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో అక్రమ టపాసుల నిల్వ.. పోలీసుల భారీ సీజ్!


