హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు! | Telangana: Youth Married Hijra In Vemulawada Temple | Sakshi
Sakshi News home page

హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు!

Jun 18 2023 8:11 AM | Updated on Jun 18 2023 8:22 PM

Telangana: Youth Married Hijra In Vemulawada Temple - Sakshi

సాక్షి, కరీంనగర్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, వాటి పరిసరాల్లో వివాహాలు చేసుకోకూడదన్న నిబంధనను ధిక్కరించి మరీ వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన హిజ్రా పింకి, హైదరాబాద్‌కు చెందిన యువకుడు శ్రీనివాస్‌ ఒకరినొకరు ఇష్టపడి శనివారం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

ఐదేళ్లుగా కలిసే ఉంటున్న వీరి పెళ్లికి ఇరువురు పెద్దలూ అంగీకరించడంతోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, అమావాస్య పేరుతో అధికారులెవరూ విధులకు హాజరుకాకపోవడం కూడా ఈ జంటకు కలిసొచ్చింది.

చదవండి: బస్సులోనే చనిపోయిన ప్రయాణికుడి మృతదేహాన్ని అదే బస్సులో ఇంటికి చేర్చిన సిబ్బంది

Advertisement
 
Advertisement
Advertisement