లోకాయుక్త ఆదేశాల ప్రకారం.. 175, 197, 198 సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చామని రెవెన్యూ అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే, లోకాయుక్త ఆదేశాల కాపీ కా వాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా.. ఆదేశాలు లేవని, మౌఖిక ఆదేశాలంటూ కొత్తరాగం అందుకోవడంతో మేమంతా విస్తుపోయాం. గతంలో సర్ఫరాజ్ అహ్మద్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ మూడు సర్వే నంబర్లు పట్టా భూములేనని ప్రభుత్వానికి నివేదించారు. ఏడు నెలలుగా హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. అమలు కాకపోతే త్వరలో కోర్టు ధిక్కరణ కింద కేసు వేసే ఆలోచనలో ఉన్నాం. – రాజగోపాల్‌రెడ్డి, రేకుర్తి


