9,11,933 | - | Sakshi
Sakshi News home page

9,11,933

Aug 18 2026 7:16 AM | Updated on Aug 18 2026 7:16 AM

నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా

అంతటా మహిళాధిక్యమే

ఎన్‌ఆర్‌ఐ, సర్వీస్‌ ఓటర్లలోనే పురుషాధిక్యం

జిల్లా ఓటర్లు

కరీంనగర్‌ అర్బన్‌:

రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 11న ప్రకటించాల్సి ఉండగా షెడ్యూల్‌ను మార్చగా సోమవారం ప్రకటించారు. మొత్తం జిల్లా ఓటర్లు 9,11,933 కాగా ఎన్‌ఆర్‌ఐ, సర్వీస్‌ ఓటర్ల వివరాలు వెల్లడించారు. జిల్లా గణాంకాలను పరికిస్తే మహిళల హవానే కనిపించింది. పురుష ఓటర్లు 4,47,808 మంది ఉండగా వీరికన్న 16,332 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. ఇక సర్వీస్‌, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లలో పురుషులే అత్యధికంగా ఉండగా మహిళలు అత్యల్పంగా నమోదయ్యారు.

ఎన్‌ఆర్‌ఐ, సర్వీస్‌ ఓటర్ల

నమోదు అంతంతే

ఎన్‌ఆర్‌ఐ, సర్వీస్‌ ఓటర్లు వేలల్లో ఉన్నప్పటికీ కేవలం రెండుమూడంకెల్లో నమోదడం విస్తుగొల్పుతోంది. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లలో కరీంనగర్‌ నియోజకవర్గంలో 39 మంది నమోదవగా ఇందులో 30మంది పురుషులు, 9మంది మహిళలు, చొప్పదండిలో ఆరుగురు పురుషులు ఒక మహిళ, మానకొండూరులో ఎవరూ నమోదు చేసుకోకపోగా హుజూరాబాద్‌లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు మాత్రమే ఓటరుగా నమోదయ్యారు. ఇక సర్వీస్‌ ఓటర్ల వివరాల్లో కరీంనగర్‌ నియోజకవర్గంలో 107 మంది నమోదు చేసుకోగా 93మంది పురుషులు, 14 మంది మహిళలు, చొప్పదండిలో 205 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, మానకొండూరులో 139 మంది పురుషులు, ఐదుగురు మహిళలు, హుజూరాబాద్‌లో 163 మంది పురుషులు, 12 మంది మహిళలు ఓటర్లుగా నమోదయ్యారు.

నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

కరీంనగర్‌ 1,32,259 1,35,889 27 2,68,175

చొప్పదండి 1,03,104 1,07,999 5 2,11,108

మానకొండూరు 1,01,837 1,04,754 1 2,06,592

హుజూరాబాద్‌ 1,10,566 1,15,485 7 2,26,058

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement