కరీంనగర్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నందుకు సోమవారం పీడీఎస్‌యూ నాయకులు కరీంనగర్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల పై చదువులకు ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తుందని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ ఆరోపించారు. ఈ విషయంపై న్యాయస్థానాలు స్పందించి విద్యార్థుల అకౌంట్‌లలో స్కాలర్‌షిప్ జమ చేయాలని చెప్పినా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేకుండా రోజురోజుకు జాప్యం చేస్తుందన్నారు. వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్స్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు వెల్ది రాజు, మానుపాటి కార్తీక్, మానుపాటి సవర్ధన్, కట్ట శ్రీకర్, వంశీ, అరుణ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.


