విషాదం: న్యూజెర్సీలో తెలుగు విద్యార్థి సజీవదహనం 

Nizamabad Shailesh Died In Road Accident At USA New Jersey - Sakshi

ఖలీల్‌వాడి (నిజామాబాద్‌): నిజామాబాద్‌ జిల్లా యువకుడు అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. భీంగల్‌ మండలం బడాభీంగల్‌కు చెందిన గుర్రపు శైలేశ్‌.. అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. 

వివరాల ప్రకారం.. న్యూజెర్సీలో శైలేశ్‌ కారులో వెళుతుండగా మరో కారును ఢీకొన్నట్టు తెలిసింది. ఈ ఘటనలో కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని.. శైలేశ్‌ కారులోనే చిక్కుకుని మృతి చెందినట్టు సమాచారం. శైలేశ్‌ న్యూజెర్సీలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌లో మాస్టర్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శైలేశ్‌ ఇంజినీరింగ్‌ చదివేందుకు గతేడాది సెప్టెంబర్ నెలలో అమెరికాకు వెళ్లాడు.

కాగా.. శైలేష్ తండ్రి సత్యం కొన్నేళ్ల కిందట గల్ఫ్ వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. తల్లి గృహిణిగా ఉన్నారు. శైలేష్ కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్‌ కన్నుమూత

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top