ప్రారంభమైన పీజీ 2వ సెమిస్టర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన పీజీ 2వ సెమిస్టర్‌ పరీక్షలు

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

ఇద్దరు కానిస్టేబుళ్లకు పదోన్నతి

తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలో పీజీ 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమైనట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. క్యాంపస్‌లోని పరీక్షా కేంద్రాన్ని వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ యాదగిరి సందర్శించి తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఒక విద్యార్థి డిబార్‌కు గురైనట్లు ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ తెలిపారు. పరీక్షలకు మొత్తం 2,052 మందికి 1,908 మంది హాజరు కాగా 144 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

కొనసాగుతున్న పీజీ 4వ సెమిస్టర్‌..

తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. పరీక్షలకు మొత్తం 1,096 మందికి 1,071 మంది హాజరు కాగా 25 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలోని ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. శుక్రవారం వీరిని తన కార్యాలయంలో సీపీ సాయిచైతన్య అభినందించారు. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్‌, అబ్బులు ఇద్దరికీ హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement