నగరంలో చైన్‌ స్నాచింగ్‌లు | - | Sakshi
Sakshi News home page

నగరంలో చైన్‌ స్నాచింగ్‌లు

Aug 15 2026 2:09 AM | Updated on Aug 15 2026 2:09 AM

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న గొలుసు చోరీలు కలకలం రేపాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తాడెం గ్రామానికి చెందిన మానస తన కూతురితో కలిసి పనినిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చింది. తిరుమల థియేటర్‌ చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ని రెండు తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. దీంతో మానస కిందపడిపోగా తన కూతురు తీవ్ర భ యాందోళనతో బైక్‌ను వెంబడించినా అత్యంత రద్దీ ప్రాంతం కావడంతో పట్టుకోలేకపోయింది. అదే సమయంలో నగర శివారులోని మాధవనగర్‌ క్యా న్సర్‌ ఆస్పత్రి వద్ద చైన్‌స్నాచింగ్‌కు యత్నించగా, మ హిళ అప్రమత్తం కావడంతో దుండగులు పారిపోయారు. వరుస చోరీ ఘటనలతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement