నిజామాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నేడు నిర్వహించనున్న 80వ స్వా తంత్య్ర దినోత్సవాల కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 9.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను కలెక్టర్ భవేశ్‌మిశ్రా, సీపీ సాయి చై తన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు శుక్రవారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎ లాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన ఆకట్టుకునే రీతిలో ఉండాలని అన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీవో సందీప్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి..
మోపాల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈనేపథ్యంలో కలెక్టర్ భవేశ్‌మిశ్రా శుక్రవారం అధికారులతో కలిసి భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌ను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.


