ఖలీల్‌వాడి: స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా ‘వికసిత్ భారత్’ దిశగా అడుగు లు పడుతున్నాయి. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రధాన థీమ్‌గా ‘యువశక్తి’ని చాటిచెబుతున్న నేపథ్యంలో ‘2047 నాటికి నిజామాబాద్ జిల్లా స్వరూపం ఎలా ఉండాలి? దేశ ప్రగతిలో యువత పాత్ర ఏమిటి?’ అనే అంశంపై జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక డిబేట్ నిర్వహించింది. ఈ చర్చా వేదికలో విద్యార్థులు తమ ఆలోచనలను, ఆకాంక్షలను నిర్భయంగా పంచుకున్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాలు మెరుగుప డి యువతకు ఉపాధి అవకాశాలు పెరిగితే జిల్లా అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలలోపు ప్రగతిలో ముందుండాలి
విద్య, వైద్యం, వ్యవసాయ, రవాణా
రంగాలు మెరుగవ్వాలి
‘సాక్షి’ ప్రత్యేక డిబేట్‌లో ‘ఎస్‌ఎస్‌ఆర్’
డిగ్రీ కళాశాల విద్యార్థుల మనోగతం


