వారికి చేతకాక నిధులు తెచ్చుకోలేదు | - | Sakshi
Sakshi News home page

వారికి చేతకాక నిధులు తెచ్చుకోలేదు

Aug 15 2026 2:09 AM | Updated on Aug 15 2026 2:09 AM

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం

వర్ని: ‘కేసీఆర్‌ హయాంలో శ్రీనివాస్‌రెడ్డి ఎక్కువ నిధులు ఎలా తెచ్చాడు.. మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు తేలేదు అంటే వారికి చేతకాక తెచ్చుకోలేదు, నాకు చేతనై తెచ్చుకున్నాను’ అని బాన్సువాడ ఎ మ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన చందూరు మండలం మేడిపల్లి లక్ష్మా పూర్‌ రోడ్డుపై కోటి రూపాయలతో నిర్మించిన వంతెన, రూ. 70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, మేడిపల్లిలో రూ. 25 లక్షలతో నిర్మించిన గ్రామపంచా యతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే బాన్సువాడలో ఎక్కువ అ భివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం, పోడు భూముల పంపిణీ, రైతులకు నూరు శాతం సాగునీరు అందించిన ఘనత తనదేనన్నారు. నియోజకవర్గంలో 1.48 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించానన్నారు. తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గంలో 2,670 మంది గిరిజనులకు 4,600 ఎకరాల పోడు పట్టాలు ఇప్పించానని పేర్కొ న్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ప్రజలకు సూచించారు. అనంతరం లబ్ధి దారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. వర్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురేష్‌ బాబా, మేడిపల్లి సర్పంచ్‌ శ్రావణి రవి, లక్ష్మాపూర్‌ సర్పంచ్‌ ఉమా సంజీవ్‌, చందూర్‌ సొసైటీ చైర్మన్‌ ప్యారం అశోక్‌, మాజీ సర్పంచులు సత్యనారాయణ, నరేందర్‌రెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement