బాసరలో ఉమ్మడి జిల్లాల డీటీసీ పూజలు | - | Sakshi
Sakshi News home page

బాసరలో ఉమ్మడి జిల్లాల డీటీసీ పూజలు

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

బాసర: నిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతిని అమ్మవారి బాలాలయంలో ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల రవాణా శాఖ ఉప కమిషనర్‌ రవీందర్‌కుమార్‌గౌడ్‌ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. సర్పంచ్‌ తీగల వెంకటేశ్‌గౌడ్‌, కిష్టగౌడ్‌ ఉప కమిషనర్‌ దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈవో గంగా శ్రీనివాస్‌, సూపరింటెండెంట్లు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు వారికి జిల్లా మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు రమ్యరాణి, తిరుపతి, రజనీకాంత్‌ ఘనంగా స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement