ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు
పరిష్కరించాలని డిమాండ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ర్యాలీ, పికెటింగ్ నిర్వహించారు. ముందుగా ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, జిల్లా సహాధ్యక్షుడు చల్ల శ్రీనివాసరావులు మద్దతు పలికి ర్యాలీ ప్రారంభించారు. నిరసనలు, నినాదాలతో 80 ఫీట్ రోడ్ మీదుగా ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్దకు చేరి బైఠాయించి పికెటింగ్ చేపట్టారు. ఫ్యాప్టో చైర్మన్, సెక్రటరీ జనరల్ బమ్మిడి శ్రీరామ్మూర్తి, పడాల ప్రతాప్‌కుమార్ ఆధ్వర్యంలో పలు భాగస్వామ్య సంఘాల నాయకులు ఇచ్చి ప్రసంగించారు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త పీఆర్‌సీ అమలు చేయాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఎస్.రమేష్‌బాబు, పూజారి హరిప్రసన్న, వై.వాసుదేవరావు, ప్రభాకరరావు, తిరుమలరావు, బి.వెంకటేశ్వర్లు, కె.జగన్మోహన్‌రావు, లండ బాబూరావు, సీహెచ్ దిలీప్, ఎస్.రమేష్ బాబు, బంగారు షణ్ముఖరావు, కోలక కృష్ణమోహన్, పి.కృష్ణారావు, ఎం.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.


