‘ముద్రగడ సేవలు చిరస్మరణీయం’ | - | Sakshi
Sakshi News home page

‘ముద్రగడ సేవలు చిరస్మరణీయం’

Jul 17 2026 7:33 AM | Updated on Jul 17 2026 7:33 AM

నరసన్నపేట:

నిరుపేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటాలు, అందించిన సేవలు ఎల్లకాలం చిరస్మరణీయం అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి, ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ చిత్ర పటానికి కృష్ణదాస్‌ పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కృష్టదాస్‌ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చెరపలేని ముద్ర వేసుకున్నారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చింతు రామారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు కేసీహెచ్‌బీ గుప్త, రాజాపు అప్పన్న, దామ మన్మధరావు, పతివాడ గిరీశ్వరరావు, కనపల శేఖరరావు, సురంగి నర్శింగరావు, పాగోటి రాజారావు, మోజ్జాడ శ్యామసుందరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement