శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం జిల్లాలో పలువురికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో పలు హోదాల్ని ఇస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం నియోజక వర్గానికి చెందిన వారికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అంధవరపు వెంకట రమే ష్, లీగల్‌సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా లోలుగు వెంకటరమణ, ఆర్టీఐ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మాధాబత్తుల జయంత్‌కుమార్, జిల్లా కళింగకోమటి, కళింగవైశ్య విభాగం అధ్యక్షులుగా తంగుడు జోగారావు (నరసన్నపేట), నియోజకవర్గాల అధ్యక్షులు గా కింతలి తిరుమలకుమార్ (టెక్కలి), వైశ్యరాజు కేశవరాజు (నరసన్నపేట), బరాటం సంతోష్ (శ్రీకాకుళం), నారాయణశెట్టి వెంకటరమణ (ఎచ్చెర్ల), శిల్లా మల్లికార్జునరావు (ఆమదాలవలస)కు చెందిన వారిని నియమించారు.
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
అరసవల్లి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి జెడ్పీ మీటింగ్ హాల్‌లో జరగనుంది. జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ సమక్షంలో జెడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరై జిల్లా లో ముఖ్య సమస్యలపై సమీక్షించనున్నారు. అలాగే ప్రభుత్వ శాఖల పనితీరు, అలాగే ఉమ్మడి జిల్లాల్లో వివిధ శాఖల ప్రగతిపై కూడా ప్రజాప్రతినిధులు తమదైన శైలిలో ప్రశ్నలు సంధించి అధికారుల నుంచి వివరణలను కోరనున్నారు. ఇక జిల్లా పరిషత్ పాలక మండలి ఐదేళ్ల పదవీ కాలం రానున్న సెప్టెంబర్ 24తో ముగియనున్న నేపథ్యంలో సర్వసభ్య సమావేశాల్లో ఇదే చివరి కీలక సమావేశంగా చెప్ప వచ్చు. సెప్టెంబర్ 23వ సాయంత్రం ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం ముగియనుండగా జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్‌పర్సన్‌ల పదవీ కాలం కూడా సెప్టెంబర్ 24న సాయంత్రంతో ముగియనున్నాయి. అయితే ప్రస్తుతానికి పాలకవర్గం కొనసాగుతున్న క్రమంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సెప్టెంబర్ 8 లోగా ఇదే సభ్యుల ఆధ్వర్యంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగాల్సి ఉంది. పూర్తి కోరంతో ఈ సమావేశాలు జరిగితే, మరోసారి కచ్చితంగా మరో సర్వసభ్య సమావేశాన్ని సెప్టెంబర్ 24వ తేదీ లోపు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సమావేశంలోనే దాదాపుగా పాలకమండలి వీడ్కోలు కూడా జరగనున్న నేపథ్యంలో తాజాగా నేడు జరుగనున్నదే అధికారిక వ్యవహారాలు జరిగే చివరి సర్వసభ్య సమావేశంగా జెడ్పీ వర్గాలు చెబుతున్నాయి.
శ్రీకాకుళం పాతబస్టాండ్: నిధుల వినియోగంలో నిర్లక్ష్యం చేయకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఆయన గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో కంపెనీల యాజమాన్య సిబ్బంది, అధికారులతో నిధుల మంజూరు, నిధుల వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖ ల వారీగా జిల్లాలో సీఎస్సార్, సీఈఆర్ గ్రాంట్లలో మంజూరైన నిధులు వాటి వివరాలను పరిశీలించారు. మొక్కల పెంపకం, చెరువులు, కుంటల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామాల్లో ప్రజలకు పారిశుద్ధ్య సదుపాయాల ఏర్పాటు, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి కల్పించడం వంటి విషయాలపై తగు సూచనలు చేశారు.
‘భూ రికార్డుల ప్రక్షాళనకే
రీ సర్వే’
శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతులకు మేలు చేకూర్చేలా రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికే అత్యంత పారదర్శకంగా రీ సర్వే పనులు చేపడుతున్నామని భూమి రికార్డుల సహాయ సంచాలకులు సి.హెచ్.వి.యస్.యన్.కుమార్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన మండల సర్వేయర్లు, రీ–సర్వే ఉప తహసీల్దార్ల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చే యాలని అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా యజమానులకు శాశ్వత హక్కులు లభిస్తాయని, ఈ క్రమంలో తలెత్తే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సర్వేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షకు ముందు లావేరు, ఆమదాలవలస మండలాల గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్ లాగిన్ లను తనిఖీ చేసి ఆన్‌లైన్ ప్రగతిని పరిశీలించారు. అనంతరం ఎచ్చెర్ల మండలం షేర్ మహమ్మద్ పురం గ్రా మానికి చేరుకుని అక్కడ రీ–సర్వే పనులను నిశితంగా తనిఖీ చేసిన ఆయన, సిబ్బంది విధులను అభినందిస్తూ స్థానిక రైతులకు సర్వే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.


