నిజాయితీ, నిబద్ధత, విలువలకు కట్టుబడి పనిచేసిన నేత ముద్రగడ పద్మనాభం. నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చివరి శ్వాసవరకు పట్టుదలతో నిలిచిన నాయకుడిగా పేరుగాంచారు. ఆయన మరణం ఆ కుటుంబానికే కాకుండా సమాజానికి తీరని లోటు. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి
విలక్షణ నేత ముద్రగడ
మాజీ మంత్రి, కాపు ఉద్య మ నేత ముద్రగడ పద్మనాభం అకాల మరణం రాష్ట్ర ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పదవుల కంటే కాపు సమాజం కోసం రాజీపడని పోరాటం చేసిన ఉద్యమ శిఖరంగా చరిత్రలో నిలిచిపోతారు. నిజాయితీ, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడేతత్వం, ఇచ్చిన మాట కోసం నిలబడే నైజం కలిగిన ఒక విలక్షణ నాయకుడిని రాష్ట్రం కోల్పోయింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి.
– తమ్మినేని సీతారాం, మాజీ శాసనసభ స్పీకర్
నిస్వార్థ నాయకుడు
ప్రజా సమస్యలపై నిరంతంరం పోరాడుతూ విలువలు, విశ్వసనీయత కలిగిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. మంచి వ్యక్తిత్వం ఉన్న ముద్రగడ లేని లోటు తీరనిది. మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. – చింతాడ రవికుమార్,
వైఎస్సార్‌సీపీ ఆమదావలస నియోజకవర్గ
సమన్వయకర్త
శాకంబరి దేవిగా కొత్తమ్మ తల్లి
కోటబొమ్మాళి కొత్తమ్మతల్లిని శాకంబరిదేవిగా బుధవారం అలంకరణ చేశారు. ఆషాఢమాసం సందర్భంగా గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి వి.రాధాకృష్ణ తెలిపారు. – టెక్కలి
నారాయణపురం నీరు విడుదల
సంతకవిటి: రంగారాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్ట నుంచి కుడి ప్రధాన కాలువకు సాగునీటిని ఆనకట్ట వైస్ చైర్మన్ ఎం.కృష్ణమూర్తి బుధవారం విడుదల చేశారు. దాదాపు 50 కిలోమీటర్ల పొడవున్న కుడిప్రధాన కాలువ నుంచి సంతకవిటి, పొందూరు, ఆమదాలవలస, ఎచ్చెర్ల మండలాల పరిధిలో 18 వేల ఎకరాల పైబడి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కార్యక్రమంలో ఆనకట్ట డీఈ వై.రవీంద్రనాయుడు, కుడి ప్రధాన కాలువ ఏఈ రాంబాబు, తదితరుల పాల్గొన్నారు.
చైన్నెలో వలస మత్స్యకారుడి దుర్మరణం
కవిటి: ఇద్దివానిపాలెం గ్రామానికి గండుపల్లి గోపాలరావు (58) చైన్నెలో వలస మత్స్యకారుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తూ బోటుపై నుంచి జారి సముద్రంలో గల్లంతయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగ్గా బుధవారం మృతదేహాన్ని గుర్తించారు. గోపాలరావుకు భార్య గోపమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పాతపట్నం: ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణీ దుర్గ అమ్మవారి హుండీ కానుకల ద్వారా రూ.7,67,657 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు, చైర్మన్ అక్కందర సన్యాసిరావు తెలిపారు. ఆలయ హుండీని బుధవారం లెక్కించగా 57 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందన్నారు. జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయం సీనియర్ సహాయకులు జీవీబీఎస్ రవికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గుమస్తా సుదర్శన్, వేంకటేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


