క్రైస్తవ పరిరక్షణ కమిటీ కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

క్రైస్తవ పరిరక్షణ కమిటీ కార్యవర్గం ఎన్నిక

Jul 15 2026 12:23 AM | Updated on Jul 15 2026 12:23 AM

శ్రీకాకుళం కల్చరల్‌: క్రైస్తవ సమాజం బలోపేతం, హక్కుల పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణ, పరస్పర సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా క్రైస్తవ పరిరక్షణ కమిటీ నూతన జిల్లా కార్యవర్గాన్ని మంగళవారం స్థానిక చర్చిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతినిధులతో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఒంపూరు రమేష్‌ (శ్రీకాకుళం), ఉపాధ్యక్షులుగా రాడ విజయకుమార్‌ (ఆమదాలవలస), ప్రత్తి అన్వేష్‌ (ఇచ్చాపురం), ప్రధాన కార్యదర్శిగా టి.జార్జి ముల్లర్‌ (ఆమదాలవలస), కోశాధికారిగా ఈ.శామ్యూల్‌ జాన్‌ (సరుబుజ్జిలి), కార్యదర్శిగా కె.పీటర్‌ పాల్‌ (చాపర), ఏరియా కో–ఆర్డినేటర్‌గా భీమ్‌ బెహరా (ఇచ్చాపురం), ప్రేయర్‌ కన్వీనర్‌గా జాడుపల్లి ఆనందరావు (సోంపేట) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కె.చిన్నవాడు (నరసన్నపేట), పి.సింహాజాన్‌ (మాకివలస), ఎస్‌.ప్రసాద్‌ (శ్రీకాకుళం), శ్రీరామ్‌ రమేష్‌ (నరసన్నపేట), పీస దాసుబాబు (మందస), బి.శేఖర్‌బాబు (ఇచ్ఛాపురం), పి.జోసెఫ్‌ (కంచిలి) ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షుడిగా కొత్తపల్లి అబ్రహం (సోంపేట), సీనియర్‌ అడ్వైజర్లుగా కె.వి.సాల్మన్‌ (టెక్కలి), వి.జాషువ (గార), ప్రత్తి విజయ్‌ కుమార్‌ (ఇచ్ఛాపురం) బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల అధికారిగా కె.వి.సాల్మన్‌ (టెక్కలి) వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement