బడికి కుళ్లిన కోడి గుడ్లు | - | Sakshi
Sakshi News home page

బడికి కుళ్లిన కోడి గుడ్లు

Jul 15 2026 12:23 AM | Updated on Jul 15 2026 12:23 AM

సరుబుజ్జిలి: మండలంలోని పెద్ద సవళాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు పంపిణీ చేసిన కోడిగుడ్లలో నాణ్యత లోపించింది. మంగళవా రం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ వారు గుడ్లను ఉడకబెట్టగా దాదాపు ఆరు గుడ్లు కుళ్లిపోయాయని విద్యార్థులు తెలిపారు. ఏజెన్సీ వారు ఎప్పటివో గుడ్లను అంటగడుతున్నారని, అధికారులు కూడా తనిఖీ చేయడం లేదని పలువురు ఆరోపించారు. ఇదే విషయమై హైస్కూల్‌ హెచ్‌ఎం అప్పలరాజును వివరణ కోరగా 6 గుడ్లు పూర్తిగా కుళ్లిపోయినట్లు గుర్తించామని, ఏజెన్సీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement