ఇచ్ఛాపురం పట్టణంలోని ప్రరభుత్వ పాఠశాలలో 1991–92లో చదివిన పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 35 సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితులంతా ఒకరినొకరు పలకరించుకుని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరపటి రాజలక్ష్మి, కేశరావు, కె.మోహన్‌రావు, ఢిల్లీరావు, శంకర్రావు, రాము, తాయారమ్మ, జ్ఞానేశ్వరి, ఉమామహేశ్వరి, ద్రాక్షావతి, లక్ష్మి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. – ఇచ్ఛాపురం


