నరసన్నపేట: స్థానిక కాలేజీ గ్రౌండ్‌లో శనివారం జిల్లా ఫుట్‌బాల్ జట్టు ఎంపిక సజావుగా జరిగింది. 33 మంది ఫుట్‌బాల్ క్రీడాకారులు సెలెక్షన్‌కు హజరుకాగా వీరిలో 20 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఫుట్‌బాల్ పై క్రీడాకారులు ఆసక్తి చూపుతున్నారని మంచి క్రీడాకారులు ఉన్నారని అన్నారు. అర్హత కలిగిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఎంపికలు జిల్లా, నరసన్నపేట ఫుట్‌బాల్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్ అసోషియేషన్ నరసన్నపేట అధ్యక్ష, కార్యదర్శులు పి.రమేష్, బంకుపల్లి రవిబాబు విశ్రాంత పీఈటీ కుంచి గోపి, ఫుట్‌బాల్ కోచ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కంచిలి: కంచిలిలో గల సోంపేట రైల్వేస్టేషన్‌లో ఓ నాలుగేళ్ల చిన్నారి శనివారం ఉదయం నుంచి టికెట్ కౌంటర్ వద్ద ఒంటరిగా ఉంది. ఆమె వద్ద ఎవరూ లేరు. స్థానికులు గమనించి చిన్నారిని స్టేషన్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లారు. పాపం తప్పిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ అసలు విషయం అప్పుడే బయటపడింది. 1098 చైల్డ్‌లైన్ వారికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి, బాలిక కుటుంబ సభ్యుల సమాచారం సేకరించారు. ఈ బాలికను పిడి మందస గ్రామానికి చెందిన తారకేశ్వరరావు కుమార్తె విసినాని విషితగా గుర్తించారు. బాలిక తండ్రితో మాట్లాడగా తనకు అనారోగ్యంగా ఉందని, బాలిక తల్లిని సంప్రదించాలని సూచించారు. కానీ బాలిక తల్లి ఎప్పుడో భర్తను విడిచిపెట్టి వెళ్లిపోయారని తెలిసింది. బాలిక ప్రస్తుతం సోంపేట మండలం కొరంజిభద్ర గ్రామంలో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటోందని, బాలిక వాళ్ల అమ్మమ్మ, పెద్దనాన్న తీసు కొచ్చి సోంపేట రైల్వేస్టేషన్‌లో విడిచిపెట్టేశారని చైల్డ్‌లైన్ పలాస కార్యాలయ సూపర్వైజర్ జె.భాగ్యలక్ష్మి తెలిపారు. దీంతో బాలికను బాలల సంక్షే మ సమితి వారి మౌఖిక ఆదేశాల మేరకు శ్రీకాకుళం శిశు గృహ చిల్డ్రన్ హోమ్‌లో ప్రస్తుతం చేర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.
సోంపేట రైల్వేస్టేషన్‌లో ఉన్న చిన్నారి బాలిక


