క్రీడలతో మెరుగైన ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మెరుగైన ఆరోగ్యం

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌

టెక్కలి: క్రీడలతో ఆరోగ్యం ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరికీ క్రీడలు అలవాటుగా మారాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌, భారత మాజీ క్రికెటర్‌ ఎం.ఎస్‌.కె.ప్రసాద్‌ అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఇంటర్‌ కాలేజ్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో విజేతలకు శనివారం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలల్లో క్రీడలను తప్పనిసరి చేయాలన్నారు. కాగా, క్రికెట్‌ పోటీల్లో ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల విజయం సాధించగా, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ జట్టు రన్నర్‌గా నిలిచింది. వాలీబాల్‌లో రఘు ఇంజినీరింగ్‌ కళాశాల విజేతగా నిలవగా, ఆదిత్య కళాశాల రన్నర్‌గా నిలిచింది. త్రోబాల్‌లో దువ్వాడ విజ్ఞాన్‌ కళాశాల విజేతగాగా, విజయనగరం ఎంవీజీఆర్‌ రన్నర్‌గా నిలిచాయి. మహిళా విభాగం చెస్‌లో ఆదిత్య కళాశాల విన్నర్‌గా నిలిచింది. పురుషుల చెస్‌లో విశాఖకు చెందిన సాంకేతిక విద్యా పరిషత్‌ విజేత కాగా, శ్రీకాకుళం ఎర్రన్నాయుడు అగ్రి కల్చరల్‌ కళాశాల రన్నర్‌గా నిలిచాయి. అధ్యాపకుల క్రికెట్‌ పోటీల్లో పర్లాఖిమిడి సెంచూరియన్‌ యూనివర్శిటీ విజేత కాగా, జీఎంఆర్‌ఐటీ కళాశాల రన్నర్‌గా నిలిచాయి. వాలీబాల్‌, త్రోబాల్‌లో జీఎంఆర్‌ఐటీ కళాశాల విన్నర్‌ కాగా, ఆదిత్య కళాశాల రన్నర్‌గా నిలిచాయి. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్‌.ఎల్‌.నాయుడు, డైరెక్టర్‌ వి.వి.నాగేశ్వర్రావు, కె.మధుకుమార్‌, టి.నాగశేషు, ప్రిన్సిపాల్‌ ఎ.ఎస్‌.శ్రీనివాసరావు, డీన్‌ డి.శ్రీరాములు, ఎం.సంతోష్‌కుమార్‌, ఎస్టేట్‌ మేనేజర్‌, పి.రమేష్‌, పీడీలు ఎస్‌.లక్ష్మణమూర్తి, మురళీమోహన్‌, తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement