శ్రావణ్‌.. నీ కీర్తి శాశ్వతం | - | Sakshi
Sakshi News home page

మరణిస్తూ మరో ఇద్దరికి ప్రాణదానం చేసిన విద్యార్థి

Oct 29 2023 12:16 AM | Updated on Oct 29 2023 9:37 AM

- - Sakshi

నరసన్నపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరసన్నపేట మారుతీ నగర్‌కు చెందిన కృష్ణ శ్రావణ్‌ మరో ఇద్దరికి ప్రాణదానం చేశాడు. కాకినాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న శ్రావణ్‌ ద్విచక్ర వాహనంతో విజయవాడ దుర్గాదేవి దర్శనానికి వెళ్తూ మూడు రోజుల కిందట ప్రమాదానికి గురయ్యాడు. వైద్యం అందించిన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు నిర్ధారించారు.

సమాచారం తెలుసుకున్న జీవన్‌దాన్‌ ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులు బంగారి రామరాజు, లావణ్య ప్రియతో సంప్రదింపులు చేసి అవయవ దానానికి అంగీకరింపజేశారు. గుండె, కాలేయం పనిచేయక పోవడంతో విద్యార్థికి చెందిన రెండు కిడ్నీలు శుక్రవారం జీవన్‌దాన్‌ రాష్ట్ర సమన్వయకర్త రాంబాబు ఆధ్వర్యంలో సేకరించి విశాఖ లోని రెండు ప్రైవేటు ఆస్పత్రులకు అందచేశారు. శ్రావణ్‌ పార్థివ దేహానికి స్వగ్రామం నందిగాం మండలం సుభద్రాపురంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రావణ్‌ తల్లి దండ్రులు బంగారి రామరాజు, లావణ్య ప్రియలకు పలువురు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement