శ్రీకాకుళం:
నగరంలోని సర్వజన ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న స్టాఫ్ నర్స్‌లు సోమ వారం కొద్దిసేపు ఆందోళన చేశారు. గడిచిన ఐదు నెలలుగా తమకు జీతాలు చెల్లించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమినికి వినతి పత్రం సమర్పించారు. ఐదు నెలలుగా జీతాలు లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఇంటి అద్దెలు చెల్లించలేకపోవడం వల్ల యజమానులు తమను ఖాళీ చేయాలని కోరుతున్నారని, పిల్లల ఫీజులు చెల్లించేందుకు రుణాలు చేయాల్సి వచ్చిందని వా టికి వడ్డీలు కూడా కట్టలేకపోతున్నామని తెలిపా రు. బడ్జెట్ ఉన్న తమకు జీతాలు ఎందుకు చెల్లించలేదని నిలదీశారు. సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆందోళన తర్వాత విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ త్వరలోనే జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


