శ్రీకాకుళం న్యూకాలనీ: ఐటీఐ రెండో ఫేజ్ కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు మంగళవారం తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని శ్రీకాకుళం డీఎల్‌టీసీ/ఐటీఐ శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ వి.రఘురాం తెలిపారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ శిక్షణ కేంద్రంలో వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. వారి టెన్త్‌క్లాస్ మార్క్స్ మెమో, టీసీ, స్టడీ, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు వెరిఫికేషన్ కోసం తీసుకురావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల కౌన్సెలింగ్ ఈనెల 12వ తేదీన జరుగుతుందని ఆయన వెల్లడించారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరు వారు 2026 –27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ యూజీలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.ఎస్.ఎన్ స్వామి తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆన్‌లైన్ కేంద్రానికి వెళ్లి drbraouap.ac.in వెబ్ పోర్టల్ ద్వారా సెప్టెంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ కె.ప్రసాదరావు కోరుతున్నట్టు చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్ 7382929616 నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలియజేశారు.
శ్రీకాకుళం అర్బన్:
శ్రీకాకుళం నుంచి భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని శ్రీకాకుళం ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సభ్యుల బృందం కోరారు. ఈ మేరకు జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి సీహెచ్ అప్పలనారాయణకు సోమవారం శ్రీకాకుళం ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎయిర్ ట్రావెలర్ అసోసియేషన్ అధ్యక్షులు నటుకుల మోహన్ మాట్లాడుతూ విమానాశ్రయానికి తక్కువ వ్యయంతో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనారాయణ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో చర్చించి, వీలైనంత తక్కువ సమయంలో కార్యాచరణ చేస్తామని తెలిపారు.


