శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదిక (గ్రీవెన్సు)లో బాధితుల నుంచి 600 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు.
ఫిర్యాదు స్వీకరించండి
తన భర్త బలివాడ శేఖర్‌పై ఈనెల 8వ తేదీ రాత్రి దేశిళ్ల నారాయణతో పాటు మరికొందరు జిల్లా పరిషత్ దగ్గర దాడిచేసి గాయపర్చారని బలివాడ ప్రశాంతి అనే మహిళ తెలిపింది. ఈ దాడిపై ఫిర్యాదు ఇవ్వడానికి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే తిరిగి తమపైనే కౌంటర్ కేసు నమోదు చేస్తామని భయపెడుతన్నారని ఎస్పీ గ్రీవెన్సులో వాపోయింది. గాయాలతో ఉన్న తన భర్తను అదే సమయంలో రిమ్స్‌లో చేర్చామని, ఎంఎల్‌సీ నమోదైనప్పటికీ స్టేషన్‌లో ఫిర్యాదు స్వీకరించలేదన్నారు.


