కూటమికి ఓటమి భయం | - | Sakshi
Sakshi News home page

కూటమికి ఓటమి భయం

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

కూటమికి ఓటమి భయం బుద్ధి మారడం లేదు.. హామీలు మరిచారు

అందుకే విపక్ష నాయకులపై వేధింపులు న్యాయ వ్యవస్థ ముందు టీడీపీ కుట్రలు విఫలం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన వైఎస్సార్‌ సీపీ నాయకులు రిమాండ్‌లో ఉన్న చింతాడను కలిసి ధైర్యం చెప్పిన నేతలు

శ్రీకాకుళం క్రైమ్‌ : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడకు వెళ్లినా లక్షల్లో జనం వస్తున్నారని, ఇది చూసి కూటమికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే అక్రమ కేసులు కట్టి విపక్ష నాయకులను వేధిస్తున్నా రని వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్‌, బూడి ముత్యాలనాయుడు, కుంభా రవిబాబు స్పష్టం చేశారు. టీడీపీ అసమర్థ పాలనను గట్టిగా ప్రశ్నిస్తుండటంతో ప్రభుత్వం ఇలాంటి దురాగతాలకు పాల్పడుతోందని అన్నారు. మొన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, నేడు చింతాడ రవి అరెస్టులే వీటికి నిదర్శనమని, అరెస్టులతో హింసించే ప్రభుత్వ తీరు సరి కాదని తీవ్రంగా విమర్శించారు. అంపోలు సబ్‌ జైలులో ఉన్న చింతాడ రవిని ము లాఖత్‌లో భాగంగా కలిసేందుకు సోమవారం ఉదయం మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు, జిల్లా పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు కుంభా రవిబాబులు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభంజనం నడుస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో ఇలాంటి దౌర్జన్యాలు లేవని గుర్తు చేశా రు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడి రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా చిత్రీకరించి తనయునితో పాటు బీసీ మత్స్యకార నాయకుడైన అ ప్పలరాజును జైలులో పెట్టారన్నారు. అప్పలరాజును కలిసేందుకు వైఎస్‌ జగన్‌ వస్తే.. జనం తండోపతండాలుగా తరలివచ్చారని, ఆ సందర్భంలో అసలు జరగని సంఘటనను భూతద్దంలో చూపించి చింతాడ రవిని అరెస్టు చేశారని తెలిపారు. కోర్టు మర్డర్‌ అటెంప్ట్‌, ఆర్గనైజింగ్‌ క్రైమ్‌ సెక్షన్లు తీసేయడంతో టీడీపీ నైతికంగా ఓడిపోయిందని అన్నారు.

అనంతరం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రత్యక్షంగా అమలు చేస్తోందని, వైఎస్‌ జగన్‌ పర్యటనకు పోటెత్తుతుంటే అక్కసుతో కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందని అన్నారు. కోర్టు తప్పు పడుతున్నా వారి బుద్ధి మారడం లేదన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో భయానక వాతావరణం నెలకొల్పేందుకు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ను చూడాలని వచ్చే నాయకులు, కార్యకర్తలు విధుల్లో ఉన్న మహిళా ఎస్‌ఐపై హత్యాయత్నం చేసేందుకు వచ్చారనడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని, వైఎస్‌ జగన్‌ వెన్నంటే ప్రాణం పోయేంతవరకు ఉంటామని అప్పలరాజు, చింతాడ రవిలు చెప్పడం చూస్తుంటే భవిష్యత్‌లో వైఎస్‌ జగన్‌ మళ్లీ గెలవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆమదాలవలస నియోజకవర్గ పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, వెలమసంఘ రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీను, యు వజన విభాగ అధ్యక్షులు గొండు హరీష్‌, సర్పంచి ఊటవల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement