డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరగాల్సిందే
మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే డిమాండ్ చేసిన విద్యార్థులు, అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా శాంతియుత నిరసన ర్యాలీలు అడుగడుగునా అడ్డు తగిలిన పోలీసులు
●జిల్లా కేంద్రంలో పోలీసులు బారికేడ్లు అడ్డంగా పెట్టి ర్యాలీ జరగకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ర్యాలీ చేస్తూ కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా బారికేడ్లు అడ్డంగా పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. బెదిరింపులు, అరెస్టులతో తమ ఉద్యమాలు ఆగవని వైఎస్సార్ సీపీ నాయకులు స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు.
●టెక్కలిలో పోలీసుల ఆంక్షలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసన ర్యాలీని ఎలాగైనా అడ్డుకోవాలని నాలుగు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు టెక్కలి రాకుండా అడుగడుగునా ఆంక్షలతో తనిఖీలు నిర్వహించారు. కానీ వేరే దారుల్లో క్యాడర్ అంతా టెక్కలి చేరుకున్నారు. ఇక్కడ కూడా అడ్డుకో వాలని ప్రయత్నించినా స్పోర్ట్స్ కోటా అక్రమాలను ఎద్దేవా చేస్తే రోడ్డుపై పేకాట ఆడుతూ భజన చేస్తూ నిరసన తెలిపారు.
జిల్లా కేంద్రంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం
ఆంక్షల మధ్యనే ఆగ్రహజ్వాల ఎగసి పడింది. నిర్బంధాల మధ్య నినాదం ప్రతిధ్వనించింది. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై
వైఎస్సార్‌సీపీ పోరు పతాక స్థాయికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా యువత తోడుగా వైఎస్సార్‌సీపీ నాయకులు శాంతియుతంగా
నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. అడుగడుగునా పోలీసులు అడ్డు పడినా ఎక్కడా అడుగు వెనక్కి వేయలేదు. అనుమతులు ఇవ్వబోమంటూ మొండికేసినా.. పట్టుదల వీడలేదు. అంబేడ్కర్ విగ్రహాలకు వినతులు ఇస్తూ, అక్రమాల ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోశారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
డీఎస్సీలో అర్హులకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్ సీపీ పోరు పతాక స్థాయికి చేరింది. పార్టీ శ్రేణులతో పాటు విద్యార్థులు, అన్యాయానికి గురైన డీఎస్సీ అభ్యర్థులు సోమవారం జిల్లా వ్యాప్తంగా కదం తొక్కారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాల్సిందేనని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనకు దిగారు. ర్యాలీకి అనుమతి ఇవ్వాలని దరఖాస్తులు చేసుకున్నా పోలీసులు అడ్డుకోవడమేంటని మండిపడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పలుచోట్ల వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. నిరుద్యోగుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడుకుందని, స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని నాయకులు ఆరోపించారు. పోలీసులు నిర్బంధం చేసినా, రోడ్డుపైకి రాకుండా అడ్డుకో వాలని చూసినా యువత ముందుకే కదిలారు.
ఆమదాలవలసలో ర్యాలీ చేసేందుకు వస్తున్న వైఎస్సార్ సీపీ క్యాడర్‌ను ఆమదాలవలస సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ బాలరాజులు అడ్డుకున్నా రు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో రోప్‌లతో ఎవరినీ రోడ్డుపైకి రానీయకుండా నిలువరించారు. అయినా వైఎస్సార్ సీపీ నాయకులు తమ నినా దాలు వినిపించారు. చింతాడ రవి అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ కూటమి దమనకాండను వివరించారు.
లావేరు, జి.సిగడాం మండలాల నుంచి వచ్చే పార్టీ శ్రేణులను లావేరు, వెంకటాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఎచ్చెర్ల వైపు నుంచి వచ్చే పార్టీ శ్రేణులు, విద్యార్థులను చిలకపాలెం వద్ద నిలువరించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు కొండములగాం నిరసన ర్యాలీ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు పార్టీ శ్రేణులు ఒక దగ్గరకు చేరుకుండా వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసు బలగాలతో అణచివేయాలని చూడడం సరికాదన్నారు.
ఇచ్ఛాపురంలో బైక్ ర్యాలీ జరపకుండా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ నాయకులు దాదాపు 30 నిమిషాల పాటు రోడ్డుపై బైఠాయించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను వివరిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నరసన్నపేటలో విజయవంతంగా ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుంచి నాలుగు మండలాల్లో ఉన్న పార్టీ ముఖ్య నాయకులను, క్యాడర్‌ను పోలీసులు నిర్బంధించే ప్రయత్నం చేశారు. కానీ వేరే మార్గాల ద్వారా అంబేడ్కర్ విగ్రహం వద్దకు పార్టీ విద్యార్థి, యువజన విభాగం నాయకులు చేరుకుని నిరసన తెలిపారు.
పలాసలో ర్యాలీ విజయవంతం కాకూడదని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బెండిగేటు, తాళభద్ర వద్ద పోలీసులు పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. అలాగే కాశీబుగ్గలో ర్యాలీని సైతం పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు నిలదీయడంతో మహిళలకు అనుమతి ఇచ్చారు. అనంతరం ర్యాలీ గా వెళ్లి గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు.
పాతపట్నంలో పోలీసులు నలువైపులా మోహరించారు. కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు ఆధ్వర్యంలో పాతపట్నం, హిరమండలం, మెళి యాపుట్టి ఎస్‌ఐలు కె.మదుసూధనరావు, వై.మదుసూధనరావు, అమీర్ ఆలీతో పాటు 30 మంది పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వైఎస్సార్‌సీపీ నాయకులకు వాగ్వాదం జరిగింది. అనంతరం నిరసన ర్యాలీ జరిగింది.


