రోడ్డు ప్రమాదంలో వైద్యాధికారిణి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వైద్యాధికారిణి మృతి

Aug 4 2023 1:46 AM | Updated on Aug 5 2023 1:50 PM

- - Sakshi

డాక్టర్‌ భవ్యశ్రీ రహదారి ప్రమాదంలో గురువారం సాయంత్రం విశాఖలో మృతి చెందారు.

శ్రీకాకుళం: మండలంలోని బట్టిగళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్‌ భవ్యశ్రీ రహదారి ప్రమాదంలో గురువారం సాయంత్రం విశాఖలో మృతి చెందారు. బట్టిగళ్లూరు వైద్య సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. భవ్యశ్రీ గురువారం విశాఖపట్నంలో షీలానగర్‌లో జరిగిన డిపార్ట్‌మెంట్‌ పరీక్షకు హాజరయ్యారు.

పరీక్ష రాశాక గాజువాకలో బంధువుల దగ్గరకు స్కూటీపై బయల్దేరారు. అయితే లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈవిడ స్వగ్రామం యానాం. భవ్యశ్రీ మృతి చెందడంతో జిల్లా వైద్యాధికారి బొడ్డేపల్లి మీనాక్షి, బట్టిగళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement