రామగిరి: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో వారంతా పదో తరగతి చదువుకున్నారు. 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఆదివారం అదే స్కూల్‌లో కలుసుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్‌లో 1997–98 లో పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒకరి కష్టసుఖాలను మరొకరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యను బోధించిన నాటి ఉపాధ్యాయులను ఘనంగా శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు.


