అవన్నీ పుకార్లే! | - | Sakshi
Sakshi News home page

అవన్నీ పుకార్లే!

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

ధర్మవరం అర్బన్‌: ‘మీ డ్రైవింగ్‌ లైసెన్సుకు మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేసుకోవాలి. అది కూడా సెప్టెంబర్‌ 25వతేదిలోపే. ఆపైన మీ డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు అవుతుంది.. లేదా బ్లాక్‌లో పడుతుంది’ అంటూ సోషల్‌ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్నవారంతా నెట్‌ సెంటర్లు, తమ మొబైల్స్‌లలో డ్రైవింగ్‌ లైసెన్సుకు ఫోన్‌ నంబర్‌ లింక్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

సైబర్‌ నేరగాళ్ల వల...!

డ్రైవింగ్‌ లైసెన్సుకు మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేసుకోవాలని సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సైబర్‌ నేరగాళ్లు వల వేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న లింక్‌లను ప్రజలు క్లిక్‌ చేయడంతో సైబర్‌ వలలో చిక్కుకుంటున్నారు. కొన్ని అనధికారిక వెబ్‌సైట్‌లలోకి ప్రజలు వెళ్లడంతో పాటు అక్కడ ఓటీపీని సైతం ఎంటర్‌ చేస్తున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్లు సులభంగా ప్రజల నుంచి డబ్బు కాజేస్తున్నారు. ప్రజలు ఇలాంటి అసత్య వార్తలు నమ్మి సైబర్‌ వలలో పడొద్దని ఆర్‌టీఓ అధికారులు చెబుతున్నారు.

అదంతా అవాస్తవం..

సోషల్‌ మీడియాలో డ్రైవింగ్‌ లైసెన్సుకు మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేసుకోవాలని వస్తున్న సమాచారం అంతా అవాస్తవమని ధర్మవరం అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.భాగ్యశ్రీ తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి డెడ్‌లైన్‌ విధించలేదన్నారు. సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించి సైబర్‌ నేరగాళ్లు అమాయక ప్రజల నుంచి డబ్బు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా, సంబంధిత అధికారులతో సంప్రదించకుండా ఒకరిని చూసి మరొకరు విస్తృతంగా సెప్టెంబర్‌ 25 డెడ్‌లైన్‌ అంటూ ప్రచారం చేస్తున్నారని, ఇదంతా నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం గాని, అధికారులు గాని ఎక్కడా డెడ్‌లైన్‌ విధించలేదని స్పష్టం చేశారు.

డ్రైవింగ్‌ లైసెన్సుకు మొబైల్‌ నంబర్‌

లింక్‌ ప్రచారం ఉత్తిదే

ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ

ఇవ్వలేదని ఆర్‌టీఓ అధికారుల వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement