ఏపీడబ్ల్యూజేఎఫ్‌, ఏపీబీజేఏ నూతన కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఏపీడబ్ల్యూజేఎఫ్‌, ఏపీబీజేఏ నూతన కమిటీ ఎన్నిక

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

పుట్టపర్తి టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌), ఆంధ్రప్రదేశ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (ఏపీబీజేఏ) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం పుట్టపర్తి పట్టణంలో సమావేశం నిర్వహించారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాయలసీమ ఇన్‌చార్జ్‌ జయరాజ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేపటి రామాంజనేయులు, అనంతపురం జిల్లా కార్యదర్శి శివప్రకాశ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీడబ్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎల్‌.శివరామకృప్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షబ్బీర్‌, ఉపాధ్యక్షులుగా ఎం. మహేష్‌, డి.శ్రీధర్‌రెడ్డి, శివరాజ్‌, ప్రవీణ్‌కుమార్‌, పి.బాబ్జాన్‌, కోశాధికారిగా ఎస్‌.బాబ్జాన్‌, జాయింట్‌ సెక్రటరీలుగా జాకీర్‌హుస్సేన్‌, రామకృష్ణ, రెడ్డి బాషా, హరి, ప్రచార కార్యదర్శిగా జి.రాజశేఖర్‌, కార్యవర్గ సభ్యులుగా ఆంజనేయులు, బాబయ్య, ధర్మారెడ్డి, హనుమంతరెడ్డి, వినోద్‌కుమార్‌, శ్రీనివాసులు, నారాయణస్వామి ఓబుళపతిని ఎన్నుకున్నారు.

● ఏపీబీజేఏ జిల్లా అధ్యక్షుడిగా కె. చలపతి, ప్రధాన కార్యదర్శిగా కె. మురళీ, ఉపాధ్యక్షులుగా విశ్వనాథ్‌, వి. రామకృష్ణ, మురళీధర్‌నాయుడు, రామాంజనేయులు, జాయింట్‌ సెక్రటరీలుగా ఎన్‌. గిరీష్‌బాబు, జగదీష్‌, నరేష్‌, కోశాధికారిగా గణేష్‌, ప్రచార కార్యదర్శిగా చంద్రశేఖర్‌, కార్యవర్గ సభ్యులుగా రాజు, శ్యామ్‌సుందర్‌, రమేష్‌, లక్ష్మీకాంతప్ప, హరికృష్ణ, రామకృష్ణ, పులివెందల నాగరాజును ఎన్నుకున్నారు. నాయకులు మాట్లాడుతూ దేశంలో 12 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్‌ విధానం అమల్లో ఉందని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి పట్టాలు అందజేయాలని, జర్నలిస్టులకు భద్రతా కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement