మునగాకు బొకేలు అందజేసి అవగాహన | - | Sakshi
Sakshi News home page

మునగాకు బొకేలు అందజేసి అవగాహన

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

ప్రశాంతి నిలయం: రెవెన్యూ భవన్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో పోషణ్‌ మాహ్‌ వేడుకలలో భాగంగా మునగాకు బోకేలను కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ ప్రజలకు అందజేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలు క్రమంగా మునగాకును ఆహారంగా తీసుకోవడం మరచిపోతున్నారన్నారు. మునగాకులో క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌–ఏ, విటమిన్‌–సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయన్నారు. మునగాకును ప్రతి ఒక్కరూ ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మునగాకు, ఇతర ఆకుకూరల వినియోగంపై అవగాహన పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ

రెవెన్యూ భవన్‌లో సోమవారం కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ ఐసీడీఎస్‌ సిబ్బందితో కలసి అంగన్‌వాడీ ఉత్సవాల పోస్టర్‌లను ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్‌ 7వ తేదీ వరకు జిల్లాలో ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement