ఆర్టీసీ బస్సు ఆపలేదని అద్దం పగులగొట్టాడు! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఆపలేదని అద్దం పగులగొట్టాడు!

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

పుట్టపర్తి అర్బన్‌: గోరంట్ల నుంచి ధర్మవరం వెళ్లే ఆర్టీసీ హైర్‌ బస్సు ప్రయాణికులు ఎక్కేంత వరకూ ఆపలేదని ఓ యువకుడు బస్సు వెనుక అద్దం పగులగొట్టిన సంఘటన పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం గోరంట్లలో బయలుదేరిన బస్సు ఉదయం 9.30 గంటలకు బత్తలపల్లి చేరుకుంది. అప్పటికే ఫుల్లుగా ఉన్న బస్సులోకి కాలేజీ విద్యార్థులు ఎక్కుతున్నారు. విద్యార్థులు, మహిళలు ఎక్కేంత వరకూ బస్సు ఆపలేదని గ్రామానికి చెందిన భాను అనే యువకుడు రాయి తీసుకుని బస్సు వెనుక అద్దం పైకి వేగంగా విసిరాడు. దీంతో అద్దం పగిలి పోయింది. వాదోపవాదాల అనంతరం అందులో ఉన్న ప్రయాణికులు అందరినీ మరో ఆర్టీసీ బస్సులో ఎక్కించి పంపించేశారు. అద్దం పగిలిన బస్సును డ్రైవర్‌ ప్రతాప్‌రెడ్డి నేరుగా ధర్మవరం ఆర్టీసీ డిపోకు తీసుకెళ్లి విషయాన్ని యజమానికి, ఆర్టీసీ డీఎంకు విన్నవించారు. బస్సు యజమాని, ఆర్టీసీ డీఎం తిరిగి బత్తలపల్లికి చేరుకుని పంచాయితీ నిర్వహించి భానుకు ఫైన్‌ విధించినట్లు తెలిసింది.

●ప్రభుత్వం అదనపు బస్సులు వేయక పోవడంతో ప్రతి బస్సూ కిక్కిరిసి పోతున్నాయి. దీంతో బస్సులు సైతం ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. ఒక బస్సుకు 50 మంది ప్రయాణికులను ఎక్కించాల్సింది 100కు పైగా ఎక్కిస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు. ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement