కరుణించిన వరుణుడు | - | Sakshi
Sakshi News home page

కరుణించిన వరుణుడు

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

పుట్టపర్తి అర్బన్‌: వరుణుడు కరుణించాడు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కొత్తచెరువు మండలంలో 70.6 మి.మీటర్లు, నల్లచెరువు 60.4, తనకల్లు 43.6 , తాడిమర్రి 40.2, పుట్టపర్తి 38.8, ధర్మవరం 38.4, బత్తలపల్లి 32.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సోమందేపల్లిలో 28.6 మి.మీ, బుక్కపట్నం 27.8, కనగానపల్లి 25.4, ముదిగుబ్బ 24.6, కదిరి 24.6, లేపాక్షి 24, తలుపుల 23.4, అమడగూరు 23.2, రామగిరి 21.4, గోరంట్ల 20.4, చిలమత్తూరు 16.6, నల్లమాడ 15.4, మడకశిర 15.4 మి.మీటర్ల వర్షం కురిసింది. పెనుకొండలో 14.2 మి.మీ, హిందూపురం 13.8, గాండ్లపెంట 13.6, రొద్దం 13.2, సీకేపల్లి 12.6, ఎన్‌పీకుంట 12.4, పరిగి 9.2, ఓడీచెరువు 8.2, అమరాపురంలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 716.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

తడిసిన వేరుశనగ

ధర్మవరం రూరల్‌: ధర్మవరం డివిజన్‌లో ఆదివారం తెల్లవారు జామున 195.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు డీవైఎస్‌ఓ ఎస్‌. గోపాల్‌ తెలిపారు. వర్షానికి చిగిచెర్లలో రైతు నల్లప్ప మూడు ఎకరాలలో తొలగించిన వేరుశనగ పంట తడిసిపోవడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు.

29 మండలాల్లో వర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement