బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామ శివారులోని ఓ పాడుబడ్డ బావిలో ఎలుగు బంటి కనిపించిన ఘటన ఆదివారం కలకలం సృష్టించింది. ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్‌రెడ్డి, అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలిని పరిశీలించారు. బావి చుట్టూ ఉన్న ముళ్ల కంపను తొలగించడంతో ఎలుగుబండి బయటకు వచ్చి సమీపంలోని కొండల వైపు పరుగులు తీసింది. ఇటీవల గ్రామ సమీపంలోని కంకర క్వారీలో ఎలుగు బంటి ఇరుక్కుపోవడం, తాజాగా పాడుబడ్డ బావిలో మరో భల్లూకం చిక్కుకుపోయిన దృష్ట్యా వన్యప్రాణుల రక్షణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బావిలో ఎలుగుబంటి


