రాజకీయంగా దెబ్బతీసేందుకే కల్తీ కుట్ర | - | Sakshi
Sakshi News home page

రాజకీయంగా దెబ్బతీసేందుకే కల్తీ కుట్ర

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

పెనుకొండ రూరల్‌: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే తిరుమల లడ్డూ కల్తీ అంటూ చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని ఈడీ తేల్చడంతో వారి కుట్రలు బయట పడ్డాయన్నారు. ఆదివారం మండలంలోని మావటూరు ఆంజనేయస్వామి ఆలయంలో టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేవలం వైఎస్సార్‌పీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే పరమ పవిత్రమైన తిరుమల లడ్డ్డూలో పంది కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు అండ్‌ కో రాద్దాంతం చేశారన్నారు. లేని వివాదాన్ని తెరపైకి తెచ్చి రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు. తాజాగా ఈడీ విచారణలో తిరుమల లడ్డూ కల్తీ జరగలేదని తేల్చి చెప్పిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తులకు, రాష్ట్ర ప్రజలకు కూటమి పార్టీల నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి అధికార పార్టీ నేతలు గురికాకతప్పదని, కర్మ రిటర్న్‌ కచ్చితంగా ఉంటుందన్నారు. మంత్రి సవిత లడ్డూ వివాదంలో వైఎస్‌ జగన్‌ను తీవ్రంగా విమర్శించారన్నారు. ఈడీ క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై కూడా ఆమె స్పందించాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడం మంత్రికి పారిపాటిగా మారిందన్నారు. గొడ్డలి పార్టీ అని ఎద్దేవా చేసే మంత్రులకు ఈడీ క్లీన్‌ చిట్‌ ఒక చెంప పెట్టు లాంటిదన్నారు.

తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని ఈడీ తేల్చడం కూటమికి చెంపపెట్టులాంటిది

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement