ఇది మా ప్రభుత్వం... మా ఇష్టం! | - | Sakshi
Sakshi News home page

ఇది మా ప్రభుత్వం... మా ఇష్టం!

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

ఓడీచెరువు: అధికార దర్పంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ సహజ సంపదను దోచేస్తున్నారు. ఓడీ చెరువు మండల పరిధిలోని తిప్పేపల్లి చెరువులో యథేచ్ఛగా మట్టిని తరలిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట భూములు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదంటున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం స్థానిక రైతులు మట్టి మాఫియాతో గొడవకు దిగారు. అయితే వారు మాత్రం ఇది మా ప్రభుత్వం.. మా ఇష్టం.. మమ్మల్ని ఆపేదెవరంటూ దౌర్జన్యానికి దిగారు. జేసీబీలు పెట్టి ఎడాపెడా మట్టిని తవ్వేస్తూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా కేవలం అధికారం అండగా ఉందని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కనీసం ఇప్పటికై నా అధికారులు స్పందించి తిప్పేపల్లి చెరువును పరిశీలించి, మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తిప్పేపల్లి చెరువులో

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

అడ్డుకున్న గ్రామస్తులకు హెచ్చరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement