‘డైట్‌’ సరఫరాకు టెండర్ల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

‘డైట్‌’ సరఫరాకు టెండర్ల ఆహ్వానం

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిధిలోని డీసీహెచ్‌ఎస్‌ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో రోగులు, వైద్య సిబ్బందికి ఆహారం (డైట్‌) సరఫరా చేసేందుకు అనుభవం, ఆసక్తి ఉన్న వారి నుంచి టెండర్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ వెంకట్రావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హిందూపురంలోని 200 పడకలు ఉన్న జిల్లా ఆస్పత్రితో పాటు తాడిపత్రి, గుంతకల్లు, మడకశిర, కదిరి, ధర్మవరం, రాయదుర్గంలోని వంద పడకల ప్రాంతీయ వైద్యశాలలు, అనంతపురంలోని సీడీ ఆస్పత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, గుత్తి, పెనుకొండ ప్రాంతాల్లోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు, కొనకొండ్ల, శింగనమల, కణేకల్లు, పామిడి, సీకే పల్లి, తనకల్లు, కొత్తచెరువు, గోరంట్ల, నల్లమాడ, రొళ్లలోని 30 పడకల సీహెచ్‌సీలకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు జిల్లా ఆస్పత్రికి రూ.2 వేలు, ప్రాంతీయ వైద్య శాలలకు రూ.1,500, సీడీ ఆస్పత్రి, సీహెచ్‌సీలకు రూ.వెయ్యి చొప్పున డీడీ (డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌, అనంతపురం) తీసి ఈ నెల 21 నుంచి 26వ తేదీలోపు కార్యాలయం పనివేళల్లో అందజేయాలి. పూర్తి వివరాలకు 80085 53730, 82475 78680 నంబర్లలో సంప్రదించవచ్చు.

జీనియస్‌ బుక్‌ రికార్డులో

ఉమర్‌ఫారూక్‌కు చోటు

హిందూపురం టౌన్‌: పట్టణానికి చెందిన సాహితీవేత్త, రక్తదాత ఉమర్‌ఫారూక్‌ఖాన్‌కు ‘జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కింది. ఈ మేరకు శుక్రవారం జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి ‘ది హ్యూమానిటేరియన్‌ లీడర్‌ ఇన్‌ బ్లడ్‌ డొనేషన్‌ సర్వీస్‌ ఫర్‌ 25 కన్సెక్యూటివ్‌ ఇయర్స్‌’ అనే రికార్డు టైటిల్‌తో సర్టిఫికెట్‌ అందించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో థలసీమియా చిన్నారులు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి దాతలను సమన్వయం చేసి ఉమర్‌ ఫారూఖ్‌ ఖాన్‌ సేవలందించారు. ఇప్పటివరకు 26 వేల రక్తదాన కేసులకు దాతల ద్వారా సహకారం అందించినట్లు రికార్డు ధ్రువపత్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన స్వయంగా 66 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయనను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement