ఎమ్మెల్యే కందికుంట డ్రైవర్‌ వీరంగం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కందికుంట డ్రైవర్‌ వీరంగం

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

కదిరి అర్బన్‌: స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ డ్రైవర్‌ గిరినాయుడు వీరంగం సృష్టించాడు. మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనే భార్య హారికతో పాటు మామ ఆదినారాయణ, అత్త సునీతమ్మతో పాటు మరికొందరిపై దాడి చేశాడు. మామ ఆదినారాయణ తలపై కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబీకులు ఆయన్ను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై గిరినాయుడు భార్య హరిత కదిరి రూరల్‌ అప్‌గ్రేడ్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా గిరినాయుడు తనను వేధిస్తున్నాడని, అతని వేధింపులు తాళలేక తాను పుట్టింటికి వెళ్లానని తెలిపారు. అయినప్పటికీ నిత్యం తనకు ఫోన్‌ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడని, తనకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అండ ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని భయాందోళనకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గిరినాయుడు బారి నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించాలని కోరారు. హరిత ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కందికుంట డ్రైవర్‌ గిరినాయుడుపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రూరల్‌ అప్‌గ్రేడ్‌ పోలీస్టేషన్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

భార్య, అత్తామామలపై దాడి

కేసు నమోదు చేసిన కదిరి రూరల్‌ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement