ఐదేళ్లకే నూరేళ్లూ నిండాయా కన్నా! | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లకే నూరేళ్లూ నిండాయా కన్నా!

Jun 26 2023 11:02 AM | Updated on Jun 26 2023 11:00 AM

- - Sakshi

బత్తలపల్లి: ‘నిత్యం మాముందు ఎంతో ఆనందంగా ఉంటుంటివే. అలాంటి నిన్ను తీసుకుపోయేందుకు ఆ దేవుడికి చేతులెలా వచ్చాయి.. ఐదేళ్లకే నీకు నూరేళ్లు నిండాయా కన్నా..’ అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కన్నీళ్లు పెట్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిని పాము కాటు వేయడంతో మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని గరిశలపల్లికి చెందిన మబ్బు నరేష్‌, లక్ష్మీ దంపతులకు యశ్వంత్‌ (5), హర్ష ఇద్దరు కుమారులు సంతానం.

ఆదివారం మధ్యాహ్నం వరకూ ఇంటి వద్ద బాగా ఆడుకున్న యశ్వంత్‌ ఉన్నఫలంగా అపస్మారక స్థితిలోకి చేరాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే కుమారుడిని స్థానిక ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. విషపురుగు కరవడంతోనే అస్వస్థతకు గురై మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. సర్పంచు పద్మావతి, వైఎస్సార్‌సీపీ నాయకులు చెన్నారెడ్డి, నాగిరెడ్డి, ఈశ్వరయ్య, ఆంజనేయులు తదితరులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement