విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం! | Three Bodies Found in a Debris Heap in Visakhapatnam’s Sheela Nagar | Sakshi
Sakshi News home page

విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!

Aug 18 2026 11:57 AM | Updated on Aug 18 2026 12:05 PM

Three Bodies Found in a Debris Heap in Visakhapatnam’s Sheela Nagar

సాక్షి, విశాఖపట్నం: నగరంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. షీలానగర్‌ జంక్షన్‌ వద్ద మట్టికుప్పలో మూడు మృతదేహాలు బయటపడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. లారీలోకి మట్టి ఎత్తి వేస్తుండగా మూడు మృతదేహాలు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

మట్టిని లారీలోకి ఎక్కిస్తున్న సమయంలో కూలీలు మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అవి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతులు ఎవరు, ఎంతకాలం క్రితం మృతి చెందారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మట్టికుప్పను పరిశీలించి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. మృతదేహాల పరిస్థితి, వాటిపై ఉన్న ఆనవాళ్లను పరిశీలించి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.

మృతులు ఎవరు? వారు షీలానగర్‌ ప్రాంతానికి చెందినవారా? మృతదేహాలు మట్టికుప్పలోకి ఎలా వచ్చాయి? ఎవరైనా కావాలనే అక్కడ పడేసి వెళ్లారా? లేక మరేదైనా ఘటనకు సంబంధించినవా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement